News June 2, 2024

తూర్పుగోదావరి జట్టుపై విశాఖ విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.

Similar News

News September 13, 2024

వరద బాధితుల కోసం విశాఖ పోర్టు రూ.కోటి విరాళం

image

విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.

News September 13, 2024

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిజిటలైజేషన్ ప్రక్రియ

image

ఏయూలో 23 లక్షల ధ్రువపత్రాలను 1996 నుంచి డిజిటలైజేషన్ చేస్తామని ఏయూ వీసీ శశిభూషణరావు తెలిపారు. ఇందులో మార్కుల జాబితాలు, ఓడీలు ఉంటాయన్నారు. 2023 నుంచి ఏయూలో చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను అకాడమీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)లో ఉంచుతామన్నారు. ఏబీసీకి సంబంధించి ప్రతి విద్యార్థికి ఒక కోడ్ ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఒక సంస్థకు అప్పగిస్తామన్నారు.

News September 12, 2024

అన్ని ఆసుపత్రులకు అనుమతి తప్పనిసరి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

image

జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోమ్‌లు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.