News September 4, 2024
తూర్పుగోదావరి జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి జిల్లాలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలను తెరవద్దని ఆయన సూచించారు.
Similar News
News September 16, 2024
కాకినాడ: అనుమానంతో భార్యను కడతేర్చాడు
విశాఖపట్నం నక్కవానిపాలెంలో కాకినాడకు చెందిన సలోమి (28)ని భర్త డానియల్ అనుమానంతో హతమార్చాడని విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ మురళి ఆదివారం తెలిపారు. ఇంట్లో భార్యను గొంతు నలిమి హత్య చేసి, కొడుకుని తీసుకొని కాకినాడ వెళ్లి పోలీసులకు లొంగిపోయాడని తెలిపారు. సలోమి హోటల్లో సూపర్వైజర్‌గా పని చేస్తందని, డానియల్ చర్చిలో వీడియో గ్రాఫర్‌గా పనిచేస్తారన్నారు. సలోమి తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు.
News September 16, 2024
తూ.గో: పెద్దాపురంలో వికసించిన బ్రహ్మ కమలం
హిమాలయ పర్వత శ్రేణుల్లో పెరిగే బ్రహ్మ కమలం పెద్దాపురంలో కొత్తపేట రామాలయం వీధికి చెందిన ఆదిరెడ్డి విజయలక్ష్మి ఇంటి పెరటిలో ఆదివారం వికసించింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూసే బ్రహ్మ కమలం మొక్కను ఆమె తులసి కోటలో నాటగా బ్రహ్మ కమలం వికసించటంతో ఆదివారం ఈ కమలాన్ని చూడడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు.
News September 15, 2024
దేవీపట్నం: అనారోగ్యంతో పాఠశాల హెచ్ఎం మృతి
దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ఎంపీపీ యూపీ పాఠశాల హెడ్ మాస్టర్ కొమరం ధర్మన్న దొర (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. కిడ్నీ, షుగర్ వ్యాధులతో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. స్వగ్రామం పాముగండి గ్రామానికి చెందిన ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.