News August 11, 2024
తూర్పు గోదావరి జేసీగా నంద్యాల జిల్లా వాసి

తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన ఎస్.చిన్న రాముడు నియమితులయ్యారు. ఏపీఎస్సీ కార్పొరేషన్ VC&MDగా ఉన్న ఆయనను తూ.గో జేసీగా ప్రభుత్వం నియమించింది. అటు నంద్యాల పూర్వపు జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డిని సీతంపేట ITDA పీవోగా బదిలీ చేయగా.. మరోసారి బదిలీ చేస్తూ ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.
Similar News
News December 2, 2025
‘రైతన్న.. మీకోసం’లో కర్నూలుకు రాష్ట్రంలో మొదటి స్థానం

వారం రోజులు నిర్వహించిన ‘రైతన్న.. మీకోసం’లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రైతులకు పంచసూత్రాలు వివరించి, ఫొటోలు పోర్టల్లో అప్లోడ్ చేయడం అత్యధిక శాతం నమోదు కావడంతో ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ఈనెల 2, 3వ తేదీల్లో రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించే వర్క్షాపులను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News December 2, 2025
విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు.