News January 9, 2025
తూ.గో: అదిరిపోతున్న బస్ ఛార్జీలు..
సంక్రాంతికి సొంతూర్లకు వచ్చేందుకు కోనసీమ జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్లు అయిపోయాయి. బస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, మండపేట ప్రధాన పట్టణాలకు ప్రయివేట్ ట్రావెల్స్‌లో సుమారుగా రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో ఛార్జీలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Similar News
News January 20, 2025
యువకుడితో మృతితో పేరవరంలో విషాద ఛాయలు
ప్రత్తిపాడు(M) ధర్మవరం వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో శివ(22) అనే యువకుడు <<15196950>>మృతి చెందిన<<>> సంగతి తెలిసిందే. బైక్‌పై నిదానంగానే వెళ్తున్నా మృత్యువు లారీ రూపంలో వచ్చి బలితీసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. వెళ్లొస్తా అంటూ హుషారుగా ఇంట్లో చెప్పి వెళ్లిన కుర్రాడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం పేరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
News January 20, 2025
నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య
తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News January 20, 2025
మారేడుమిల్లి ‘గుడిసె’ ప్రవేశానికి రేట్లు ఇవే
ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి మండలంలోని గుడిసె హిల్ స్టేషన్‌కు వెళ్లేందుకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన టోల్ గెట్‌లో చెల్లించవలసిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఫోర్ వీలర్‌కు రూ. 300, టు వీలర్‌కు రూ. 100, ప్రతీ వ్యక్తికి రూ. 100 ప్రవేశ రుసుము చెల్లించాలి. వీడియో కెమెరాకు రూ.1000, డ్రోన్ కెమెరాకు రూ. 2000 చెల్లించాలి. నిబంధనలు అతిక్రమిస్తే రూ. 500 ఫైన్ పడుతుందని అధికారులు తెలిపారు.