News June 17, 2024
తూ.గో: అమ్మలకు తప్పని కడుపు కోతలు

నార్మల్ డెలివరీలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనబడట్లేదు. తూ.గో జిల్లాలో 100 ప్రసవాల్లో 70 సిజేరియన్ ద్వారానే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
➤ 2023-24లో మొత్తం 23,673 ప్రసవాల్లో 11,944 ఆపరేషన్లే. మాతృమరణాలు-14
☞ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,269 మంది ప్రసవిస్తే.. 3,527 మందికి సిజేరియన్లే
☞ ప్రైవేట్లో 16,404 ప్రసవాలు జరిగితే.. 8,417 మందికి కడుపు కోతే.
Similar News
News December 5, 2025
రాజమండ్రి: 5000 కెమెరాలు..17 డ్రోన్లతో నిఘా

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందాలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 5, 2025
రాజమండ్రిలో నిలిచిన విమాన సర్వీసులు

పైలట్ల సమ్మె కారణంగా మధురపూడి విమానాశ్రయంలో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, 3.30 గంటలకు రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన రిటర్న్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. అలాగే దిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన పలు సర్వీసులు సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
News December 5, 2025
కొవ్వూరు ఉత్తమ పుష్కర కేంద్రంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

రానున్న పుష్కరాల నాటికి కొవ్వూరును సంపూర్ణంగా అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఉత్తమ పుష్కర కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సీఎం చంద్రబాబుని కోరారు. గురువారం ఆయన సీఎంను కలిసి మొత్తం రూ.286.53 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు అందజేశారు. పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో రోడ్లు, ఆలయ పునర్నిర్మాణం, స్నాన ఘాట్లు, నివాస సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.


