News August 27, 2024
తూ.గో: అర్హత లేని వారికి రూ.15 వేల పింఛన్
మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం రూ.15 వేలు పింఛన్ అందిస్తోంది. కొంత మంది అనర్హులు ఈ పెన్షన్ అందుకుంటున్నారు. దీనిపై ఉమ్మడి జిల్లాలో గ్రామాల వారీగా సర్వే చేపట్టారు. కాకినాడ జిల్లాలో 323 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 1203 మంది, కోనసీమ జిల్లాలో 668 మంది ఈ పెన్షన్ అందుకుంటున్నారు. వారిలో అనర్హులున్నారని దివ్యాంగులు చేసిన ఫిర్యాదుపై సర్వే చేపట్టారు. నిపుణులైన వైద్యులచే ఈ సర్వే చేయిస్తున్నారు.
Similar News
News September 8, 2024
తూ.గో.: 3 జిల్లాలకు DCC నూతన అధ్యక్షులు
తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు నూతనంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మద్దేపల్లి సత్యానందరావు నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా టీకే విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు.
News September 8, 2024
ఉమ్మడి తూ.గో. జిల్లా ఇన్‌ఛార్జి హైకోర్టు జడ్జిగా జస్టిస్ జయసూర్య
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి హైకోర్ట్ జడ్జిలను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు ఈ నెల 6న ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హైకోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా జస్టిస్ జయసూర్యను నియమించారు.
News September 8, 2024
అల్లకల్లోలంగా ఉప్పాడ బీచ్.. నేడు, రేపు జాగ్రత్త
ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగసి పడడంతో ఆ ప్రాంతమంతా కోతకు గురవుతోంది. బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన రాళ్ల గోడను సైతం దాటుకుని అలలు ఎగసి పడుతున్నాయి. శనివారం బీచ్ రోడ్డులో వెళ్లిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలల కారణంగా తీర ప్రాంతంలో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. కాగా.. వాతావరణ శాఖ అధికారులు తీర ప్రాంత ప్రజలు ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.