News December 11, 2024
తూ.గో: అలా జరిగి ఉంటే వారు బతికి ఉండేవాళ్లు

మరో 5 కిలో మీటర్లు ప్రయాణించి ఉంటే ఇంటికి చేరుకునే వారు. అంతలో వారిని మృత్యువు కబళించింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య, కుమారుడు మృతి చెందగా.. మరొక కుమారుడు గల్లంతయ్యారు. దీంతో విజయ్ కుమార్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాపిల్లలను కోల్పోయానని అతడు మృతదేహాల వద్ద రోధించిన తీరు అందరినీ కలచివేసింది.
Similar News
News November 28, 2025
రాజానగరం: ధాన్యం కొనుగోళ్లపై జేసీ ఆరా

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 28, 2025
రాజమండ్రి: అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసిన కమిషనర్

అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన కచ్చితంగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రోజువారీ హాజరుపై ఆరా తీశారు. పేదలకు అందించే భోజనం ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చూస్తూ, మెనూను తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.
News November 28, 2025
మారిన తూ.గో స్వరూపం.. పెరిగిన ఓటర్ల సంఖ్య

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. మండపేట నియోజకవర్గం అదనంగా చేరడంతో జిల్లాలో మండలాల సంఖ్య 21కి, నియోజకవర్గాల సంఖ్య ఏడు నుంచి ఎనిమిదికి పెరిగాయి. నవంబర్ 11 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 16,23,528 ఉండగా, మండపేట నియోజకవర్గం చేరికతో మొత్తం ఓటర్ల సంఖ్య 18,37,852 కు పెరిగింది.


