News July 29, 2024
తూ.గో: ఇదీ.. ‘డొక్కా సీతమ్మ’ గొప్పదనం

మధ్యాహ్న భోజన పథకానికి ‘డొక్కా సీతమ్మ’ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈమె భవానీశంకరం-నరసమ్మల(మండపేట) కూతురు. ఎందరో ఆకలి తీరుస్తున్న గొప్ప మనసు గల సీతమ్మను చూసి లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆమెను పెళ్లి చేసుకున్నారు. పిఠాపురం మహారాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి సీతమ్మ వద్ద భోజనం చేశారని, బ్రిటీష్ కింగ్ ఎడ్వర్డ్-7 పట్టాభిషేకానికి సీతమ్మ వెళ్లకపోతే ఆమె ఫొటో పెట్టి వేడుక చేశారని చెబుతుంటారు.
Similar News
News September 13, 2025
తూ.గో: నేడు కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టనున్న కీర్తి

జిల్లా కలెక్టర్‌గా నియమితులైన చేకూరి కీర్తి నేడు విధుల్లో చేరనున్నారు. ప్రస్తుత కలెక్టర్ ప్రశాంతి ఆమెకు బాధ్యతలు అప్పగించనున్నారు. విశాఖకు చెందిన కీర్తి 2016లో 14వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. తొలుత చిత్తూరు జిల్లా సబ్-కలెక్టర్‌గా, ఉమ్మడి తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ పని చేశారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో జాయింట్ డైరక్టర్‌గా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు ఈమె మూడోవ కలెక్టర్.
News September 12, 2025
తూ.గో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నాతి బుజ్జి

గండేపల్లి మండల ఎంపీడీవోగా పనిచేసి, ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA)లో డీఎల్డీఓగా పదోన్నతి పొందిన నాతి బుజ్జి, తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు. శనివారం ఆమె హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం డిప్యుటేషన్ పద్ధతిలో జరిగిందని, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
News September 12, 2025
బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై కేసు పెట్టాం: కొవ్వూరు సీఐ

కొవ్వూరులో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన దాసరి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం తెలిపారు. బాలికను యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎస్సీ అట్రాసిటీతో పాటు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.