News March 20, 2025
తూ.గో : ఈ మండలాల ప్రజలకు హెచ్చరిక

తూ.గో జిల్లాలో నేడు ఎండలు విపరీతంగా ఉండనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. జిల్లాలోని గోకవరం, కొవ్వూరు, పెరవలి, రాజమండ్రి, రాజానగరం మండలాల్లో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆ జిల్లాలో ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తాయని బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News March 28, 2025
RJY: జిల్లాలోని అభివృద్ధి ప్రతిపాదనలకు సీఎం ఆమోదం

జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో తూ. గో జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదించినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మౌలిక సదుపాయాలు, సేవా రంగం, పర్యాటక అనుబంధ రంగాలు, హైవేల అభివృద్ధి, నర్సరీ రైతులకి ఉపాధిహామీ పని దినాలు కల్పన, తదితర అంశాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
News March 27, 2025
రాజమండ్రి : వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిందితుడి అరెస్ట్

వైద్య విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దీపక్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దీపక్, అంజలిపై లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు కుటుంబీకులు ఆరోపించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గురువారం అతన్ని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ భవ్య కిశోర్ వెల్లడించారు.
News March 27, 2025
రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న అంజలి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపకే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.