News March 31, 2024
తూ.గో.: ఉదయం టీడీపీలోకి.. సాయంత్రం వైసీపీలోకి

అమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో ఆదివారం ఉదయం స్థానిక ఏ.వేమవరప్పాడుకు ప్రభాకర్ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. అయితే సాయంత్రానికి వారు వైసీపీలో చేరారు. వారు మాట్లాడుతూ.. ఇష్టం లేని పార్టీలో తాము ఉండలేమంటూ వైసీపీలో చేరారు. జడ్పీటీసీ పందిరి హరి, సర్పంచ్ విజయ సమక్షంలో వైసీపీలో చేరారు. మంత్రి విశ్వరూప్ విజయానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News April 20, 2025
రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.
News April 20, 2025
రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత

పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు హర్షకుమార్‌ను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. క్రైస్తవులు, వివిధ సంఘాల నేతలు పాస్టర్ ప్రవీణ్‌కి నివాళులర్పించారు. పరిస్థితి ఉద్రిక్తత అవ్వడంతో నలుగురు నేతలను అదుపులోకి తీసుకుని రాజనగరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News April 20, 2025
రాజమండ్రి: మాజీ ఎంపీపై మూడో కేసు నమోదు

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్‌పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.