News November 11, 2024
తూ.గో: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ వివరాలను ఆమె వారికి తెలిపారు. డిసెంబర్ 5న పోలింగ్ జరుగుతుందన్నారు.
Similar News
News October 11, 2025
యథాతధంగా PGRS కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమం అక్టోబర్ 13వ తేదీ సోమవారం యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. ప్రజలు తమ డివిజన్/మండల కేంద్రంలో, గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్జీలు అందజేసి సమస్య పరిష్కారం పొందాలన్నారు. అర్జీలను 1100 నంబర్, లేదా meekosam.ap.gov.in ద్వారా కూడా తెలియజేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News October 11, 2025
14న రాజమండ్రిలో జాబ్ మేళా

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో మంగళవారం ప్రముఖ వాయుపుత్ర మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీఎంఎస్) కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. 2020–2025 మధ్య డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News October 11, 2025
పాపికొండల విహారయాత్ర స్టార్ట్

గోదావరి వరదల నేపథ్యంలో నిలిచిన పాపికొండల విహారయాత్రను మొదలెట్టేందుకు శనివారం నుంచి అనుమతి ఇచ్చామని జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ తెలిపారు. నదిలో వరద కారణంగా జులై 11వ తేదీన విహారయాత్ర బోట్లను నిలిపి వేశారు. 3 నెలల అనంతరం మళ్లీ పాపికొండల అందాలను చూసేందుకు టూరిస్టులకు అవకాశం లభించింది. గండి పోచమ్మ ఆలయం, పురుషోత్త పట్టణం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి.