News December 21, 2024
తూ.గో: ఉమెన్స్ బీచ్ వాలీబాల్ పోటీలకు ఏర్పాట్లు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉప్పలగుప్తం మండలం సూరసేన యానాం బీచ్‌లో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఉమెన్స్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎస్.ఎస్ వై. బీచ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిజికల్ డైరెక్టర్లు శుక్రవారం బీచ్‌లో ఏర్పాట్లు చేశారు. 8 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు.
Similar News
News January 19, 2025
పిఠాపురంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
పిఠాపురంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు బూరుగుపాలెంకు చెందిన గూనూరు భరత్(22)గా గుర్తించారు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్‌లో ఉద్యోగం చేశాడు. ప్రేమించిన యువతి దూరమవుతుందని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు.
News January 19, 2025
తూ.గో: 20వ తేదీన యథావిధిగా పీజిఆర్ఎస్
ఈనెల 20వ తేదీన సోమవారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలని సూచించారు.
News January 18, 2025
రాజమండ్రి: 19 అంగుళాల దూడ.. చూడటానికి జనం ఆసక్తి
ఆవుకు 19 అంగుళాల చిన్నిదూడ పుట్టింది. దీంతో ప్రజలు ఆ దూడని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని అగ్రహారంలో తాడల సాయి శ్రీనివాస్ ఎంబీఏ చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయికి మూగ జీవాలపై ఉన్న ప్రేమతో గత 3 సంవత్సరాల నుంచి తన ఇంట్లో పుంగనూరు జాతికి చెందిన ఆవును పెంచుకుంటున్నాడు. శనివారం ఆ ఆవు 19 అంగుళాల దూడకు జన్మనిచ్చింది. చిన్నగా చూడచక్కగా ఉంది.