News May 20, 2024
తూ.గో.: ఎడ్లబండిలో మృతదేహం తరలింపు
తూ.గో. జిల్లా అడ్డతీగల మండలం దగ్గర తిమ్మాపురం పంచాయతీ పరిధి గడిచిన్నంపాలేనికి సరైన రహదారి లేక గ్రామస్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామానికి చెందిన పెంటరావు అనారోగ్యంతో చికిత్సపొందుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని వాహనంలో తీసుకొద్దామంటే గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక ఎడ్లబండిలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Similar News
News December 6, 2024
ఇప్పుడు అంతటా కాకినాడే హాట్ టాపిక్
రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా విషయం సంచలనం రేపుతోంది. సెజ్ భూములు, రేషన్ బియ్యం రవాణా, పోర్టు యజమానిపై బెదిరింపుల వంటి అంశాలు రోజుకు ఒకటి వెలుగుచూస్తున్నాయి. అక్రమ రేషన్ బియ్యం పేరుతో వేల కోట్ల రూపాయలు పలువురు నేతలు దోచేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డీప్ వాటర్ పోర్టు, సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News December 6, 2024
నేటి నుంచి కాకినాడ జిల్లాలో రెవెన్యూ సదస్సులు
గ్రామాల్లో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కాకినాడ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025 జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు కొనసాగుతాయని చెప్పారు. భూ సమస్యలు ఉన్న రైతులు అర్జీలు అందజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.
News December 6, 2024
9న నన్నయలో బీఈడీ స్పాట్ అడ్మిషన్లు
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఈనెల 9వ తేదీన బీఈడీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు. బీఈడీ రెండు సంవత్సరాల కోర్సుకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఎడ్-సెట్ 2024 పరీక్ష రాసిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ విద్యార్థులు 40 శాతం, ఓసీ విద్యార్థులు 50 శాతం మార్కులు డిగ్రీలో పొంది ఉండాలన్నారు.