News May 12, 2024

తూ.గో: ‘ఎన్నికల ఉపాధికి బ్రేక్ పడింది’

image

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులుగా తూ.గో జిల్లాలోని సాధారణ ప్రజలకు దొరికిన ఉపాధికి ఈ వారాంతంలో బ్రేక్ పడింది. అభ్యర్థులు తమ ప్రచారాల కోసం గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలను సమీకరించారు. కూలి చెల్లించి తమ వెంట తిప్పుకున్నారు. పూల వ్యాపారులతో మొదలై, టెంట్లు, టీ, టిఫిన్ సెంటర్లకు సైతం తాజా ఎన్నికల నేపథ్యంలో కొంత ఆదాయం లభించింది. ప్రచార పర్వానికి తెరపడటంతో ఇప్పుడు ఆ ఉపాధికి బ్రేక్ పడింది.

Similar News

News March 15, 2026

ఏలూరు జిల్లాలో డ్యామ్‌లో మునిగి దేవరపల్లి వాసుల మృతి

image

దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డ్యామ్‌లో మునిగి మరణించారు. గల్లంతైన వారిని తుమ్మల నాగరాజు, రమణగా గుర్తించారు. పోలీసుల వివరాలు.. గుబ్బల మంగమ్మ ఆలయంకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దు- కలెక్టర్

image

గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఒకేసారి ఎక్కువ బుకింగ్‌లు చేయవద్దని, అవసరమైనప్పుడే సిలిండర్లు తీసుకోవాలని కోరారు. వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా ఇంటి నుండే సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, ఆయిల్ కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.