News June 1, 2024
తూ.గో.: ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చినట్లేనా..? మీ కామెంట్..?

ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. కాగా ఉమ్మడి తూ.గో.లోని 19 స్థానాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఫలితాలను అంచనావేశాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూటమికి 15, వైసీపీకి 3 వస్తాయని, కేకేసంస్థ టీడీపీ- 9, జనసేన- 6 గెలుస్తాయని సర్వేలో పేర్కొన్నాయి. ఇదే తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?
Similar News
News November 2, 2025
1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల సాయం: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో 1,185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
News November 2, 2025
తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా

కార్తీక మాసం కారణంగా తాళ్లపూడి మండలంలో మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం నాటికి కిలో చికెన్ రూ.200-220 పలుకుతుండగా, నాటుకోడి రూ.600, మేక మాంసం రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయగలరు.
News November 1, 2025
పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


