News February 3, 2025
తూ.గో: ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ

నేడు 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్డ్ వెలువడనుంది. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లను 10 తేదీ వరకు ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం 3.గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ అనంతరం 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News November 27, 2025
విద్య వైద్యం ఇవ్వండి.. ఉచిత పథకాలు వద్దు: వెంకయ్య నాయుడు

తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజలను సోమరి పోతులుగా తయారు చేస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే చాలని, బస్సులు ఫ్రీగా ఇమ్మని ఎవరు అడిగారని ప్రశ్నించారు. సంపద సృష్టించాలి తప్ప అప్పులు చేయడం తప్పు అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోనే పరిపాలన చేయాలని ముఖ్యమంత్రులను కోరారు.
News November 27, 2025
రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రివ్యూ&రేటింగ్

హీరో కష్టాన్ని తీర్చేందుకు అభిమాని ఏం త్యాగం చేశాడనేదే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ స్టోరీ. ఫ్యాన్ బయోపిక్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో పాత్రలో ఉపేంద్ర, అభిమాని రోల్లో రామ్ అద్భుతంగా నటించారు. రామ్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, ఎమోషనల్ సీన్లు ప్లస్ కాగా లెన్తీ, ఊహించే సీన్లు, స్లో నరేషన్ మైనస్.
రేటింగ్- 2.75/5
News November 27, 2025
పార్టీ నిర్ణయిస్తే సీఎంగా డీకేను స్వాగతిస్తాం: పరమేశ్వర

కర్ణాటకలో CM మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా సీఎం ఆశావహుల్లో ఉన్నా. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కూడా ఆ పదవికి తగిన అభ్యర్థే. కానీ ఆ పోస్టుకు హైకమాండ్ DK శివకుమార్ను నిర్ణయిస్తే స్వాగతిస్తాం. పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అధిష్ఠానానికి తెలుసు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, డీకే మధ్య డీల్ గురించి నాకు తెలియదు’ అని పేర్కొన్నారు.


