News March 3, 2025

తూ.గో: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్

image

ఏలూరు సర్‌సీఆర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. విధులకు హాజరయ్యే సిబ్బందితో కాలేజీ రోడ్ అంతా సందడిగా నెలకొంది. లెక్కింపు ప్రక్రియకు 700 మంది సిబ్బందితో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప శివ కిశోర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.

Similar News

News October 15, 2025

త్వరలోనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

image

త్వరలోనే జిల్లాలో సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులు తమ పంట ధాన్యాన్ని తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవద్దని ఆమె సూచించారు. రైతులు తప్పనిసరిగా తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని తెలిపారు. పంటల అమ్మకం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.

News October 15, 2025

కళాశాలల మధ్యే పొగాకు విక్రయాలు

image

తిరుపతి బాలాజీ కాలనీ సమీపంలోని విద్యాపీఠం ఆర్చ్ వద్ద నిషేధిత సిగురెట్లు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఓ వైపు SV ఆర్ట్స్ కళాశాల వెనుక వైపు, మరో వైపు ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల, ఇంకో వైపు విద్యాపీఠం, ఎస్వీ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News October 15, 2025

ICAR-IARIలో 18 ఉద్యోగాలు..

image

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) 18 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాలి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iari.res.in/