News March 3, 2025

తూ.గో: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్

image

ఏలూరు సర్‌సీఆర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. విధులకు హాజరయ్యే సిబ్బందితో కాలేజీ రోడ్ అంతా సందడిగా నెలకొంది. లెక్కింపు ప్రక్రియకు 700 మంది సిబ్బందితో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప శివ కిశోర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 19, 2025

మార్చి:19 చరిత్రలో ఈ రోజు

image

*1901: ఆంధ్రరాష్ట్ర తొలి శాసన సభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
*1952: సినీనటుడు మోహన్ బాబు జననం
*1952: సినీనటుడు, బాబుమోహన్ జననం
*1966: దివంగత ఐపీఎస్ ఉమేశ్ చంద్ర జననం
*1982: ఆచార్య జె.బి కృపలానీ మరణం
*2008: సినీనటుడు రఘవరన్ మరణం
*2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం మరణం

News March 19, 2025

అలంపూర్‌లో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

image

ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గత 20 రోజుల క్రితం నిప్పంటించుకున్న వ్యక్తి కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నర్సింహులు ఆత్మహత్యకు యత్నించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఓ ఫైనాన్స్ కంపెనీ వారు అతడిని వేధించారని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. 

News March 19, 2025

మహబూబ్‌నగర్: ‘బీసీ బిల్లు రాజ్యాధికారానికి తొలిమెట్టు’

image

బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించడంలో బీసీ సంఘాల ముఖ్యపాత్ర ఉందని బీసీ ఐక్యవేదిక ఉద్ఘటించింది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ MBNRలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42%రిజర్వేషన్లు ప్రకటించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!