News May 12, 2024
తూ.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

ఉమ్మడి తూ.గోలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. అనపర్తి-87.4, రాజానగరం-87.4, రామచంద్రపురం-87.1, మండపేట-86.9, జగ్గంపేట-85.6, కొత్తపేట-84.4, ముమ్మిడివరం-83.6, తుని-83.2, అమలాపురం-83.1, గన్నవరం- 82.4, పత్తిపాడు-81.3, పిఠాపురం-81.2, పెద్దాపురం-80.6, రాజోలు- 80, రంపచోడవరం-77.4. రాజమండ్రి రూరల్-74.2, కాకినాడ రూరల్-74, కాకినాడ సిటీ-67, రాజమండ్రి సిటీ-66.2. ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి.
Similar News
News February 18, 2025
కొవ్వూరు: దళితుల వ్యతిరేకని జగన్ మరొకసారి నిరూపించుకున్నారు

జగన్ దళిత వ్యతిరేకి అని మరోసారి నిరూపించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కే.ఎస్ జవహర్ అన్నారు. మంగళవారం కొవ్వూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దళిత బాధితులను పరామర్శించడానికి రాని జగన్ ఇప్పుడు, నేరస్థుడుకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. దళిత యువకుడిని బాధించిన నేరస్థుడు వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ హేయమైన చర్య అన్నారు. జగన్ వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.
News February 18, 2025
విభజన చట్టం పై చర్చకు పవన్ చొరవ చూపాలి: ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేసి నేటికీ 11 సంవత్సరాలకుగాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రధారిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో విభజన చట్టంపై చర్చించేందుకు కేంద్రానికి నోటీసు ఇచ్చేలా చూడాలని ఉండవల్లి కోరారు.
News February 18, 2025
కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. భార్య కుమారితో కలిసి కొత్తపేట మండలం మందపల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం బైకుపై తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బైకుపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.