News June 3, 2024
తూ.గో.: ఐదుకు చేరిన మృతుల సంఖ్య
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద గత నెల 27న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన సత్య (30) విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, భార్య సత్య, కుమార్తె రాధాప్రియ, కుమారుడు రాకేష్, బంధువు గోపితో కలిసి కారులో వెళ్తూ లారీని ఢీ కొట్టి ట్రాలీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News September 11, 2024
కోనసీమ: 9 ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం
రాజోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికపై సత్యనారాయణ (72) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక సోదరి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదుచేసినట్లు రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 7న బాలిక ఆడుకుంటుండగా నిందితుడు చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియవేసి అత్యాచారానికి ప్రయత్నించాడన్నారు. పిల్లలు తలుపు కొట్టడంతో పారిపోయాడన్నారు.
News September 11, 2024
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నేడు పర్యటన
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం (నేడు) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం రాత్రి ఆర్డీవో సీతారామారావుతో కలిసి పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సామర్లకోటలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గంలో 2.40 గంటలకు కిర్లంపూడి మండలం రాజుపాలెం చేరుకొని నీటమునిగిన గ్రామాలు, పంటలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు.
News September 10, 2024
కాకినాడ: ఈ మండలాల్లో రేపు స్కూళ్లకు సెలవు
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పలు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారి రమేష్ తెలిపారు. కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు గమనించాలన్నారు.