News March 1, 2025

తూ.గో : ఒక్క నిమిషం వారి కోసం..!

image

తూ.గో జిల్లాలో 51 కేంద్రాలలో 43,754 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

Similar News

News March 2, 2025

రాజమండ్రి: చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల

image

రాజమండ్రి రూరల్ రాజవోలు గ్రామానికి చెందిన సోడదాసి రమణ, కీర్తన దంపతుల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంది. పేద దంపతులు అయిన వీరు అప్పులు బారిన పడి సతమవుతున్న స్థితిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంతో ఎమ్మెల్యే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేసి నేడు చెక్కును అందజేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నర్సిపల్లి హారిక తదితరులు ఉన్నారు.

News March 1, 2025

తూ. గో : ఆర్టీసీకి శివరాత్రి ఆదాయం ఇలా..!

image

శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ. 13.78 లక్షలు అదనపు ఆదాయం సమకూరినట్లు రాజమండ్రి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె. షర్మిల అశోక ప్రకటించారు. తూ. గో జిల్లా ఆర్టీసీ రీజినల్ పరిధిలో రాజమండ్రి, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు డిపోల నుంచి మొత్తం 64 బస్సులు నడిపినట్లు చెప్పారు. 

News March 1, 2025

తూ.గో జిల్లాలో నేటి నుంచి కొత్త రూల్స్

image

నేటి నుంచి న్యూ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి రానుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5 వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధిస్తామన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని కోరారు.

error: Content is protected !!