News February 22, 2025
తూ.గో: ‘కెమికల్ పరిశ్రమలపై తనిఖీలు నిర్వహించాలి’

జిల్లాలోని కెమికల్ ఆధారిత, ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి, భద్రత ప్రమాణాలు, వాటినుంచి వెలువడే రసాయనాలను, వాయువులు స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంతి శనివారం రాజమండ్రిలో ఆదేశించారు. పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించే లేదని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News September 13, 2025
హోంగార్డ్స్ డి.ఎస్.పి గా పి. కిరణ్ కుమార్ బాధ్యతలు

తూర్పు గోదావరి జిల్లా డి.ఎస్.పి (హోంగార్డ్స్)గా పి. కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. 1996 బ్యాచ్‌కు చెందిన కిరణ్ కుమార్ సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News September 13, 2025
తూ.గో: కొత్త కలెక్టర్‌ను కలిసిన ఆర్డీవో

తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కలెక్టర్‌గా పనిచేస్తున్న పి. ప్రశాంతి బదిలీపై వెళ్లారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్లో నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.
News September 13, 2025
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.