News December 17, 2024

తూ.గో: కొనసాగుతున్న పోలీస్ పహారా

image

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో పోలీస్ పహారా కొనసాగుతుంది. ఇరు వర్గాలు దాడిలో ముగ్గురు మృతి చెందడంతో సామర్లకోట మండలం వేట్లపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా‌ సోమవారం రాత్రి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. నిరంతరం పరిస్థితులను సమిక్షిస్తున్నారు.

Similar News

News January 18, 2025

రాజమండ్రి: 19 అంగుళాల దూడ.. చూడటానికి జనం ఆసక్తి

image

ఆవుకు 19 అంగుళాల చిన్నిదూడ పుట్టింది.‌ దీంతో ప్రజలు ఆ దూడని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని అగ్రహారంలో తాడల సాయి శ్రీనివాస్‌ ఎంబీఏ చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయికి మూగ జీవాలపై ఉన్న ప్రేమతో గత 3 సంవత్సరాల నుంచి తన ఇంట్లో పుంగనూరు జాతికి చెందిన ఆవును పెంచుకుంటున్నాడు. శనివారం ఆ ఆవు 19 అంగుళాల దూడకు జన్మనిచ్చింది. చిన్నగా చూడచక్కగా ఉంది.

News January 18, 2025

రాజమండ్రి: పీఎం ఇంటర్న్ షిప్ గోడపత్రికలు ఆవిష్కరణ

image

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ద్వారా రాబోయే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్‌లో పీఎం ఇంటర్న్ షిప్ పథకం గోడ ప్రతులను జిల్లా పరిశ్రమల అధికారి రామన్, సహాయ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, నైపుణ్య అభివృద్ధి అధికారి పెరుమాళ్ళరావుతో ఆవిష్కరించారు.

News January 18, 2025

కోరుకొండ నారసింహుని ఆలయంలో మద్యం, మాంసం

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ నారసింహుని ఆలయం ప్రాంగణంలో మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వ్యవహారం బయట వారి పనా.. లేక ఆఫీస్ సిబ్బంది పనా అంటూ ఉన్నతాధికారులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.