News May 18, 2024

తూ.గో: కోడిగుడ్డు ధర పెరిగింది

image

కోడిగుడ్డు ధర పెరిగింది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో రూ.7కు విక్రయం జరుగుతోంది. ప్రస్తుతం ధర పెరిగినప్పటికీ రైతుల నుంచి రూ.5కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 300 పౌల్ట్రీలు ఉన్నాయి. దాదాపు 1.40 కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుంది. రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కోడిగుడ్డుకు నికరంగా రూ.6 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.

Similar News

News December 7, 2024

9న తేదీన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రద్దు

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ఈనెల 9వ తేదీన నిర్వహించడం లేదని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం ఆయన కాకినాడ కలెక్టరేట్ నుండి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల వలన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

News December 7, 2024

ఈ నెల 10 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: తూ.గో కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నుంచి ఆమె శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.  గ్రామాలలో భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

News December 6, 2024

కాకినాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 14 మందికి జైలు శిక్ష

image

కాకినాడలో 42 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. నిందితులను కాకినాడ మూడో స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వి.‌నరసింహారావు ముందు హాజరుపరిచారు. వారిలో 14 మందికి రెండు రోజుల చొప్పున జైలు‌ శిక్ష పడింది. 28 మందికి రూ.10 వేలు చొప్పున రూ.2,80,000 జరిమానా వేశారు.