News January 8, 2025
తూ.గో: కోడి పందేల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంక్రాంతికి నిర్వహించే కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న పందేలను పూర్తిగా ఆపేయకుండా, కత్తులు కట్టకుండా నిర్వహిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్
Similar News
News October 30, 2025
ధవళేశ్వరం: 94 వేల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

మొంథా తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బుధవారం సాయంత్రం 94,122 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ముందస్తు చర్యలో భాగంగా, తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.
News October 28, 2025
తుఫాన్ చర్యలపై రాజమండ్రి MP ఆరా

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
News October 28, 2025
తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.


