News November 12, 2024

తూ.గో: క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమాలు

image

క్యాన్సర్ నివారణ కోసం ప్రజలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ సిబ్బందికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె వైద్యరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 నుంచి ప్రజలందరికీ ఇంటి వద్దనే క్యాన్సర్ పరీక్షలను చేపట్టేందుకు గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎం&హెచ్వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News December 6, 2024

కాకినాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 14 మందికి జైలు శిక్ష

image

కాకినాడలో 42 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. నిందితులను కాకినాడ మూడో స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వి.‌నరసింహారావు ముందు హాజరుపరిచారు. వారిలో 14 మందికి రెండు రోజుల చొప్పున జైలు‌ శిక్ష పడింది. 28 మందికి రూ.10 వేలు చొప్పున రూ.2,80,000 జరిమానా వేశారు.

News December 6, 2024

ఇప్పుడు అంతటా కాకినాడే హాట్ టాపిక్

image

రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా విషయం సంచలనం రేపుతోంది. సెజ్ భూములు, రేషన్ బియ్యం రవాణా, పోర్టు యజమానిపై బెదిరింపుల వంటి అంశాలు రోజుకు ఒకటి వెలుగుచూస్తున్నాయి. అక్రమ రేషన్ బియ్యం పేరుతో వేల కోట్ల రూపాయలు పలువురు నేతలు దోచేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డీప్ వాటర్ పోర్టు, సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News December 6, 2024

నేటి నుంచి కాకినాడ జిల్లాలో రెవెన్యూ సదస్సులు

image

గ్రామాల్లో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కాకినాడ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025 జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో  సదస్సులు కొనసాగుతాయని చెప్పారు. భూ సమస్యలు ఉన్న రైతులు అర్జీలు అందజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.