News May 4, 2024
తూ.గో.: గుండెపోటుతో ASI మృతి
తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ASI పీవీ నాగేశ్వరరావు గుండెపోటుతో శనివారం మృతిచెందారని చింతూరు ఎస్సై శ్రీనివారావు తెలిపారు. ఆయన ఏడుగురాళ్లపల్లి అవుట్ పోస్ట్‌లో డ్యూటీ చేస్తుండగా కుప్ప కూలిపోవడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. దీంతో చింతూరులో విషాదం నెలకొంది.
Similar News
News November 4, 2024
తూ.గో : ప్రాణం తీసిన క్రెడిట్ కార్డు
తూ.గో జిల్లాలో ఓ క్రెడిట్ కార్డు యువకుడి మృతికి కారణమైంది. గండేపల్లి(M) పి.నాయకంపల్లికి చెందిన సత్యసాయి(22) బ్రాయిలర్ కోళ్లు పెంచుతున్నాడు. ఈక్రమంలో గత నెల 30న ఫ్రెండ్ క్రెడిట్ కార్డుతో రూ.1000 పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఈ విషయం అతనికి తెలిస్తే అవమానంగా ఉంటుందని భావించాడు. అదే రోజు రంగంపేట మండలం కోటపాడు సమీపంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా మృతదేహాన్ని గుర్తించారు.
News November 4, 2024
నేడు రాజమహేంద్రవరంలో యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
News November 3, 2024
నవంబర్ 4న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 4,5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం నుంచి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికారులతో వివిధ సమీక్షలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని పెర్కొన వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఆయా సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారని సిబ్బంది పేర్కొన్నారు.