News August 5, 2024

తూ.గో.: గోకవరం మహిళ వరల్డ్ రికార్డ్

image

తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రానికి చెందిన దామోదర లలిత జ్యోతి వరల్డ్ వైడ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. బెంగళూరుకు చెందిన శశి క్లాసెస్ సంస్థ దేశవ్యాప్తంగా జూన్ 26న ఆన్‌లైన్‌లో నిమిషంలో ఎక్కువ ఆర్గానిక్ సబ్బుల తయారీపై పోటీ నిర్వహించారు. కాగా 27 మంది బృందంగా ఏర్పడి 2008 సబ్బులు తయారుచేశారు. వీరిలో లలిత ఒకరు. కాగా ఆమె ఆదివారం వరల్డ్ వైడ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌ నుంచి మెడల్ అందుకున్నారు.

Similar News

News December 3, 2025

ఈ నెల 5న మెగా పేరెంట్స్ డే: డీఈవో

image

జిల్లా వ్యాప్తంగా 988 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్య పరిశీలన, బోధన విధానాలు, ప్రోగ్రెస్ కార్డులు, ల్యాబ్‌లు, బోధన సామాగ్రి ప్రదర్శన వంటివి నిర్వహిస్తారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రుల సమక్షంలోనే పరిశీలిస్తామని, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

News December 3, 2025

తూ.గో: వైసీపీ నేత కారు దగ్ధం.. ఎస్పీకి ఫిర్యాదు

image

రాజమండ్రి రూరల్ మండలం వెంకటనగరంలో వైసీపీ నాయకుడు మోత రమేశ్‌ కారును మంగళవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. దీనిపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు.. ఎస్పీ నరసింహ కిషోర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై తక్షణమే విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితునికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

News December 3, 2025

CM చంద్రబాబు నల్లజర్ల షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 11:20కి నల్లజర్ల చేరుకుంటారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 11:20–11:40 AM రైతన్నా–మీ కోసం స్టాళ్ల పరిశీలన, 11:45AM వేదిక వద్దకు చేరుకుంటారు. కలెక్టర్ స్వాగత ప్రసంగం. 11:50 AM–12:15 PM రైతులతో సీఎం పరస్పర చర్చ ఉంటుందన్నారు. 12:15–12:20 PMఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రసంగం, రైతులకు సన్మానం, 1.15 గంటలకు పార్టీ కేడర్‌తో సమావేశం అవుతారన్నారు.