News August 5, 2024
తూ.గో.: గోకవరం మహిళ వరల్డ్ రికార్డ్
తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రానికి చెందిన దామోదర లలిత జ్యోతి వరల్డ్ వైడ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. బెంగళూరుకు చెందిన శశి క్లాసెస్ సంస్థ దేశవ్యాప్తంగా జూన్ 26న ఆన్‌లైన్‌లో నిమిషంలో ఎక్కువ ఆర్గానిక్ సబ్బుల తయారీపై పోటీ నిర్వహించారు. కాగా 27 మంది బృందంగా ఏర్పడి 2008 సబ్బులు తయారుచేశారు. వీరిలో లలిత ఒకరు. కాగా ఆమె ఆదివారం వరల్డ్ వైడ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్ నుంచి మెడల్ అందుకున్నారు.
Similar News
News September 18, 2024
అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు
అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
News September 18, 2024
గంగవరం: విద్యార్థినులతో HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్
గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను మంగళవారం విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం తెలిపారు. రామకృష్ణపై రహస్యంగా, సమగ్ర విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు.
News September 18, 2024
సినిమా చూపిస్తూ.. కాకినాడ జీజీహెచ్‌లో ఆపరేషన్
కాకినాడ జీజీహెచ్‌లో తొండంగి మండలానికి చెందిన అనంతలక్ష్మి (55)కి మంగళవారం అదుర్స్ సినిమా చూపిస్తూ మొదటి సారిగా అరుదైన ఆపరేషన్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. మత్తు ఎక్కువ ఇవ్వకుండా సినిమా చూపిస్తూ మెదడులో కణతి తొలగించామన్నారు. ఆమె 15 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర విభాగానికి రాగా.. మెదడులో కణతి ఉందని గుర్తించారు. అవేక్ క్రేనియటోమీ అనే అధునాతన పద్ధతిలో ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.