News February 12, 2025

తూ.గో: చికెన్, గుడ్ల సరఫరా నిలిపివేత

image

కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో తూ.గో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్స్‌లో గుడ్లు, చికెన్ సరఫరాను నిలిపివేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి శోభారాణి తెలిపారు. గుడ్లకు బదులుగా బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, ఆదివారం మటన్ కర్రీ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో గుడ్ల సరఫరా నిలిపివేశారు.

Similar News

News March 28, 2025

RJY: జిల్లాలోని అభివృద్ధి ప్రతిపాదనలకు సీఎం ఆమోదం

image

జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశంలో తూ. గో జిల్లా తరఫున నివేదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదించినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మౌలిక సదుపాయాలు, సేవా రంగం, పర్యాటక అనుబంధ రంగాలు, హైవేల అభివృద్ధి, నర్సరీ రైతులకి ఉపాధిహామీ పని దినాలు కల్పన, తదితర అంశాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

News March 27, 2025

రాజమండ్రి : వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిందితుడి అరెస్ట్

image

వైద్య విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దీపక్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దీపక్, అంజలిపై లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు కుటుంబీకులు ఆరోపించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గురువారం అతన్ని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ భవ్య కిశోర్ వెల్లడించారు.

News March 27, 2025

రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

image

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న అంజలి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపకే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.

error: Content is protected !!