News October 29, 2024
తూ.గో: చిరుత దాడి చేసిందనే ప్రచారం అవాస్తవం

కూనవరం మండలం లింగాపురంలో కొద్దిరోజులుగా పులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. అయితే చింతూరు నుంచి కూనవరం వస్తున్న కారుపై దాడి చేసిందనే ప్రచారం అవాస్తవమని CI కన్నప్పరాజు తెలిపారు. అసత్యపు ప్రచారాలపై ప్రజలు భయాందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారన్నారు.
Similar News
News December 7, 2025
రేపు ‘నన్నయ్య’కు మాజీ ఉపరాష్ట్రపతి

ఆదికవి నన్నయ వర్సిటీలో 8, 9 తేదీల్లో “భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం”పై జాతీయ కార్యశాల జరగనుంది. కేంద్ర విద్యాశాఖ, భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శాస్త్రీయ పదజాలాన్ని ప్రాంతీయ భాషల్లోకి సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
News December 7, 2025
రాజమండ్రిలో నేటి చికెన్ ధరలు ఇలా

రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
కొవ్వూరు బీజేపీలో ఆధిపత్య పోరు

కొవ్వూరు BJPలో ఆధిపత్య పోరు ఉందని ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పరిమి రాధాకృష్ణ మధ్య సఖ్యత లోపించిందని క్యాడర్ గుసగుసలాడుతోంది. తాజాగా కొవ్వూరు రైల్వే స్టేషన్లో రెండు హాల్టుల పునరుద్ధరణపై ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణకు మారుపేరైన BJPలో ఇలాంటి పరిస్థితి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు.


