News July 14, 2024
తూ.గో.: చెట్టుపడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

తూ.గో. జిల్లా పెరవలి మండలం ఖండవల్లి హైవేపై శనివారం చెట్టు పడి చాగల్లుకు చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మల్లుల కువలేశ్ (25) మృత్యువాత పడ్డాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కువలేశ్ తల్లితండ్రులు సత్యనారాయణ, ధనలక్ష్మిని చూసేందుకు వారం రోజుల క్రితం సొంతూరు వచ్చాడు. ఇరగవరం మండలం పేకేరులోని అమ్మమ్మ తులసమ్మను చూసేందుకు వెళ్లి బైక్ పై తిరిగి వస్తుండగా హైవే పక్కన ఉన్న చెట్టు అతనిపై పడి మృతిచెందాడు.
Similar News
News December 2, 2025
ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.