News June 14, 2024
తూ.గో జడ్పీ ఛైర్మన్ విప్పర్తి సోదరుడు మృతి
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వేణుగోపాలరావు సోదరుడు విప్పర్తి రామారావు(75) గురువారం రాత్రి ధవళేశ్వరంలోని స్వగృహంలో మృతి చెందారు. రామారావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఇంటికి వెళ్లి జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావును పరామర్శించారు.
Similar News
News September 11, 2024
దేవరపల్లి యాక్సిడెంట్.. CM తీవ్ర దిగ్భ్రాంతి
తూ.గో. జిల్లా దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News September 11, 2024
కోనసీమ: 9 ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం
రాజోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికపై సత్యనారాయణ (72) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక సోదరి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదుచేసినట్లు రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 7న బాలిక ఆడుకుంటుండగా నిందితుడు చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియవేసి అత్యాచారానికి ప్రయత్నించాడన్నారు. పిల్లలు తలుపు కొట్టడంతో పారిపోయాడన్నారు.
News September 11, 2024
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నేడు పర్యటన
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం (నేడు) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం రాత్రి ఆర్డీవో సీతారామారావుతో కలిసి పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సామర్లకోటలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గంలో 2.40 గంటలకు కిర్లంపూడి మండలం రాజుపాలెం చేరుకొని నీటమునిగిన గ్రామాలు, పంటలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు.