News September 22, 2024
తూ.గో.: జలతరంగిణి ఘటనపై మంత్రి దుర్గేశ్ విచారం

మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద వాగులో ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన చాలా విచారకరమని అన్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 9, 2025
తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.
News November 8, 2025
తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 8, 2025
రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.


