News September 22, 2024
తూ.గో.: జలతరంగిణి ఘటనపై మంత్రి దుర్గేశ్ విచారం
మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద వాగులో ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన చాలా విచారకరమని అన్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 9, 2024
రాజానగరం: భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం
రాజానగరం మండలం భూపాలపట్నంలో ఓ బర్త్ డే పార్టీలో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం ఓ ఫంక్షన్ హాల్ వద్ద జరుగుతున్న బర్త్ డే ఫంక్షన్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులు కారులో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. యువకులకు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న కోణంలో కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
News October 9, 2024
తూ.గో: దసరాకు 16 ప్రత్యేక రైళ్లు
దసరాకు విజయవాడ-శ్రీకాకుళం, శ్రీకాకుళం-విజయవాడకు 16 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ మంగళవారం తెలిపారు. విజయవాడ-శ్రీకాకుళానికి ఈ నెల 9, 10,11,12,14,15,16,17 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. శ్రీకాకుళం-విజయవాడకు ఈ నెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో ప్రత్యేక రైలు తిరుగుతుందన్నారు. ఈ రైళ్లు నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, ద్వారపూడి స్టేషన్లో నిలుస్తాయన్నారు.
News October 9, 2024
తూ.గో: ఇన్‌స్టాలో పరిచయమై ఇంట్లో చెప్పకుండా వెళ్లారు..
దసరా సెలవులకు విశాఖకు వెళ్లి సరదాగా గడపాలనుకొన్న నలుగురు బాలికలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. రాజమండ్రి, రావులపాలేనికి చెందిన వారికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అందరూ మాట్లాడుకొని విశాఖకు బయలుదేరగా రాజమండ్రిలో షీ టీమ్స్ బాలికలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.