News October 25, 2024

తూ.గో: జాబ్ మేళాలో 48 మందికి ఉద్యోగాలు

image

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వికాస ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్ మేళాకు 188 అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా వికాస మేనేజర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన 48 మంది అభ్యర్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వికాస అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2024

నవంబర్ 4న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 4,5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం నుంచి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికారులతో వివిధ సమీక్షలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని పెర్కొన వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఆయా సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారని సిబ్బంది పేర్కొన్నారు.

News November 2, 2024

బాధిత కుటుంబానికి అండగా వైసీపీ: మాజీ మంత్రి

image

కడియం మండలం బుర్రిలంకలోని ఓ మహిళ ఇటీవల హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

News November 2, 2024

కోనసీమ ఎస్పీకి ఫోన్ చేసిన పవన్  

image

రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఆలమూరు మండలం మడికి చెందిన శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి, 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె వెన్నెల ఆత్మహత్య చేసుకుందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. చెముడులంక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వెన్నెల స్కూల్ యాజమాన్యం ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందన్నారు. కోనసీమ ఎస్పీతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు.