News May 25, 2024
తూ.గో జిల్లాకు జూన్ 7లోగా రుతుపవనాల ఎంట్రీ

వచ్చేనెల మొదటివారంలోనే ఉమ్మడి తూ.గో జిల్లాకు రుతుపవనాలు రానున్నాయి. ఈనెల 29 నుంచి 30 లోగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేస్తున్నారు. ఇవి నాలుగు లేదా ఐదవ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీరానికి చేరుతాయి. అప్పట్నుంచి భారీగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లా సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ సారి 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
Similar News
News September 15, 2025
రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.

రాజమండ్రి: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులతో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.