News March 12, 2025
తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ ఐఏఎస్ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News March 25, 2025
రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు.
News March 25, 2025
పెరవలి : చికెన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి

అన్నవరప్పాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి , పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హనుమంతు కూడా కన్నుమూశాడు. అయితే వారు ఇరువురూ చికెన్ కోసం అన్నవరప్పాడుకు వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
News March 25, 2025
హుకుంపేట : తల్లీ కుమార్తె హత్య.. డీఎస్పీ ఏమన్నారంటే..!

హుకుంపేట డిబ్లాకుకు చెందిన తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో ముద్దాయి శివకుమార్‌ను కొవ్వూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ నిందితుడిని పట్టుకున్నారన్నారు. యువతి వేరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందని అది సహించకే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.