News June 6, 2024
తూ.గో. జిల్లాలోనే అతితక్కువ ఓట్లు ఈ MLA అభ్యర్థికే

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓ స్వత్రంత్ర అభ్యర్థికి అతి తక్కవ ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాటే సుబ్రహ్మణ్యానికి 53 ఓట్లు వచ్చాయి. కాగా జిల్లాలో అత్యధికంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం నానాజీకి 1,34,414 ఓట్లు వచ్చాయి.
Similar News
News November 5, 2025
రాజమండ్రి: ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం 2.0 కింద అర్హులను గుర్తించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నవంబర్ 30వ తేదీ లోగా అర్హులైన పేదల వివరాలు సేకరించాలని కలెక్టర్ హౌసింగ్ అధికారి ఎన్. బుజ్జిని ఆదేశించారు.
News November 5, 2025
మైనారిటీలకు ఉచిత ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ: సునీల్

రాష్ట్ర మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఉచిత ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కార్పొరేషన్ ఉమ్మడి తూ.గో జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు ఎం.సునీల్ కుమార్ తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్, ఏపీ టెట్, డీఎస్సీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు విజయవాడ భవానిపురంలోని CEDM Office, ఫోన్: 0866-2970567 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
News November 4, 2025
డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం: కలెక్టర్

జిల్లాకు చెందిన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, అవసరమైన శిక్షణ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ ఇండియా క్యాంపస్ హెడ్ మెర్లిన్ కలెక్టర్‌ని కలిశారు. సదర్లాండ్ సంస్థ రాజమండ్రిలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు, అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు.


