News April 24, 2024

తూ.గో జిల్లాలో జోరందుకున్న నామినేషన్ల పర్వం

image

తూ.గో జిల్లాలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. 4వ రోజు సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీ లత తెలిపారు. లోక్‌ సభకు 4, అసెంబ్లీలకు 20 దాఖలయ్యాయని అన్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా సోమవారం వరకూ లోక్‌ సభకు 5 నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు 48 దాఖలయ్యాయి.

Similar News

News January 14, 2025

తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య

image

తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 14, 2025

జగ్గన్నతోటలో భారీ బందోబస్త్: సీఐ

image

అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ఈ నెల 15న నిర్వహించే ప్రభల తీర్థానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 372 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పి.గన్నవరం సీఐ భీమరాజు సోమవారం తెలిపారు. ఏడుగురు సీఐలు, 23 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, 230 మంది పోలీసులు, 80 మంది హోంగార్డులను నియమించామన్నారు. ఎస్ఐ చిరంజీవి పర్యవేక్షణలో మొబైల్ టీమ్ తీర్థంలో సంచరిస్తారన్నారు.

News January 13, 2025

పిఠాపురంలో 389 బైండోవర్ కేసులు

image

పిఠాపురం నియోజవర్గంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో 389 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. పేకాట, కోడిపందేలు నిర్వహిస్తారన్న  సమాచారంతో రెండు కోళ్లు, రూ. 24 వేల నగదు స్వాధీన పరుచుకొని 14 మందిని అరెస్టు చేశామన్నారు. కోడిపందేలు జరిగే ప్రాంతాలను గుర్తించి 35 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.