News May 24, 2024

తూ.గో జిల్లాలో తొలి ఫలితం కొవ్వూరుదే

image

తూ.గో జిల్లాలో ఓట్ల లెక్కింపు నాడు కొవ్వూరు నియోజకవర్గ ఫలితం మొదట వెలువడనుంది. జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 116 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కొవ్వూరు-13 రౌండ్లు, నిడదవోలు-15, రాజానగరం-16, అనపర్తి-17, రాజమండ్రి సిటీ-17, రాజమండ్రి రూరల్-20, గోపాలపురం-18 రౌండ్లలో ముగియనుంది. ఒక్కో నియోజకవర్గానికి 14చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది.

Similar News

News October 27, 2025

ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత: కలెక్టర్

image

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని APSDMA రెడ్ అలర్ట్ ఇచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం సూచించారు. 50-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలవవద్దని హెచ్చరించారు. సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

News October 26, 2025

సెలవు రోజులలో పాఠశాలలో తెరిస్తే కఠిన చర్యలు: DEO

image

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు 27, 28 తేదీలలో 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు DEO కంది వాసుదేవరావు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే పునరావాసం కోసం HMలు అందుబాటులో ఉండి పాఠశాల భవనాలు ఇవ్వాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవు దినాలలో రూల్స్ బ్రేక్ చేస్తూ పాఠశాలలు తెరిచిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని DEO హెచ్చరించారు.

News October 26, 2025

రాజమండ్రి: పాపికొండల విహారయాత్ర బోట్ల నిలిపివేత

image

తుపాన్ కారణంగా రాజమండ్రి నుంచి పాపికొండల విహారయాత్రకు బయలుదేరే బోట్లను నిలిపివేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని ఆమె హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.