News September 9, 2024
తూ.గో. జిల్లాలో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

తూర్పుగోదావరి జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సెలవును జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో అమలు చేయాలని ఆమె సూచించారు. మరోవైపు కాకినాడ జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News November 22, 2025
‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
News November 22, 2025
తూ.గో జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గణాంకాలలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పేర్కొన్నారు. 75.54 శాతం మార్కులతో జిల్లా ఈ ఘనత సాధించిందన్నారు. సేవల్లో నాణ్యత, ఆరోగ్య ప్రచార కార్యక్రమాల నిర్వహణతో ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
News November 22, 2025
“తూర్పు”లో టెన్త్ రాయనున్న 26,619 విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 26,619 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించాలని డీఈఓ సూచించారు.


