News October 29, 2024

తూ.గో. జిల్లాలో పకడ్బందీగా నూతన మద్యం పాలసీ

image

తూర్పుగోదావరి జిల్లాలో పకడ్బందీగా నూతన మద్యం పాలసీని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. రాజమహేంద్రవరంలో సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 125 మద్యం షాపులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ షాపులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ ఈ నెల 31వ తేదీతో ముగుస్తుందని తెలిపారు.

Similar News

News October 31, 2024

తూ.గో: గుజరాత్‌లో మృతి చెందిన వారు వీరే..

image

తూ.గో. జిల్లా యువకులు ఇద్దరు గుజరాత్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. కొవ్వూరు(M)కి చెందిన రవితేజ, లోహిత్ గుజరాత్‌లో మంగళవారం స్నేహితులతో కలిసి విహరయాత్రకు వెళ్లి జలాశయంలో మునిగిపోయారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్థానిక MLA వెంకటేశ్వరరావు ఎంపీ పురందీశ్వరికి ఈ విషయం చెప్పగా.. అక్కడి అధికారులతో ఆమె మాట్లాడారు. వారి మృతదేహాలను కొవ్వూరుకు రప్పించాలన్నారు.

News October 31, 2024

గుజరాత్‌లో ఇద్దరు తూ.గో. జిల్లా వాసులు మృతి

image

ఇద్దరు తూ.గో. జిల్లా యువకులు గుజరాత్‌లో చనిపోయారు. కొవ్వూరు(M) చెందిన టీడీపీ నేత హరిబాబు కుమారుడు రవితేజ, మరొక యువకుడు లోహిత్ గుజరాత్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వారు అక్కడ పలు ప్రాంతాలను చూసేందుకు వెళ్లి ఓ జలాశయంలో మునిగి చనిపోయారు. కుమారుల మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి మృతదేహాలు కొవ్వూరుకు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు MLA వెంకటేశ్వరరావు తెలిపారు.

News October 31, 2024

పిఠాపురం: ‘ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం’

image

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభవాళి దీపావళి అని అభివర్ణించారు. దీపాల శోభతో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అనాదిగా వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలకు సకల శుభాలను ఆనందాన్ని కలుగజేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రం దీపాల వలె వెలగాలని కోరారు.