News July 12, 2024
తూ.గో జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్

తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, అనపర్తి ,కోనసీమ, సామర్లకోట,ఏజెన్సీ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. పనుల కోసం అడవులలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.
Similar News
News February 17, 2025
రాజమండ్రి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

తూ.గో జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లలో లేదా దళారులకు తక్కువ ధరలకు వాటిని అమ్మి నష్టపోవద్దని జేసీ చిన్న రాముడు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతుల కష్టాన్ని దళారీల వ్యవస్థ దగా చేస్తుందోని రాజమండ్రి నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతు బజార్లలో తమ పంటలను విక్రయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను సంప్రదించాలని రైతులను కోరారు.
News February 17, 2025
బొమ్మూరు: నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 17న పీజీఆర్ఎస్ రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్‌లకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదన్నారు. ప్రజలు తమ సమస్యలను మీ కోసం పోర్టల్ ద్వారా సమీపంలో ఉన్న సచివాలయాల్లో అర్జీలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.
News February 17, 2025
నల్లజర్ల: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

నల్లజర్ల మండలం పోతవరంకు చెందిన గాడి వెంకటేశ్వరరావు (77) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై పరమహంస తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట పవర్ ప్లాంట్ ఎదురుగా కాలవ పక్కన అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడన్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు నిడదవోలు పోలీస్ స్టేషన్‌లో అనుమానస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.