News March 7, 2025
తూ.గో జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. తూ.గో జిల్లా వాసులు ఎక్కువగా ఉమ్మడి తూ.గో జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థల్లో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా తూ.గో జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.
Similar News
News March 19, 2025
రాజానగరం: దివాన్ చెరువులో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

రాజమండ్రిలోని దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అకాడమీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి రావడంతో.. దివాన్ చెరువు వద్ద దాని ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక్కడ అకాడమీ ఏర్పాటు నిర్ణయం పట్ల స్థానిక ఎమ్మెల్యే బత్తుల హర్షం వ్యక్తం చేశారు.
News March 19, 2025
రాజమండ్రిలో సందడి చేసిన కోర్టు చిత్ర బృందం

రాజమండ్రిలోని స్వామిథియేటర్‌లో మంగళవారం ‘కోర్టు’ సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్రంలో పులికొండ లాయర్ పాత్రపోషించిన ప్రియదర్శి, హీరో హర్షరోషన్, హీరోయిన్లు శ్రీదేవి,రిషిక, రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు. కోర్టు సినిమా అందర్ని గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలన్నారు.
News March 19, 2025
రాజమండ్రీలో సందడి చేసిన కోర్టు చిత్ర బృందం

రాజమండ్రిలోని స్వామిథియేటర్‌లో మంగళవారం ‘కోర్ట్’ సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్రంలో పులికొండ లాయర్ పాత్రపోషించిన ప్రియదర్శి, హీరో హర్షరోషన్, హీరోయిన్లు శ్రీదేవి,రిషిక, రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులు పాల్గొని ప్రేక్షకులతో మాట్లాడారు. కోర్ట్ సినిమా అందర్ని గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలన్నారు.