News April 5, 2025
తూ.గో: జిల్లాలో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం

రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. అండర్-15,అండర్ -20 బాలుర బాలికల విభాగంలో నిర్వహిస్తున్న ఈ కుస్తీ పోటీలకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి 350 మంది రెజ్లర్స్ హాజరయ్యారు. ఈ పోటీలను శనివారం జిల్లా ఎస్పీ డీ నరసింహ కిషోర్ ప్రారంభించారు.
Similar News
News April 16, 2025
రాజమండ్రి: నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

నేటి నుంచి జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ వేసవిలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. బుధవారం నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ జూన్ 11 నుంచి జూలై 12వరకు ముహూర్తాలు లేవు. జూలై 25 నుంచి శ్రావణమాసంలో శుభ ఘడియలు ఉండటంతో ముహూర్తాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.
News April 16, 2025
తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో AMP (M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 16, 2025
చాగల్లు: యువకుడిపై పోక్సో కేసు నమోదు

బాలికను నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. చాగల్లు (M) బ్రాహ్మణగూడెంకు చెందిన బాలిక(15)పై అదే గ్రామానికి చెందిన సిద్దార్ధ చంద్ర అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఈనెల 10న ఫిర్యాదు చేసింది. సిద్దార్ధను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు.