News April 5, 2025
తూ.గో: జిల్లాలో వాతావరణం శాఖ హెచ్చరికలు

తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆంధ్ర ప్రదేశ్లోని పలు జిల్లాల్లో శని, ఆదివారం పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు చెట్లు, కరెంట్ పోల్స్, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 25, 2025
తూ.గోలోకి కాదు.. కొత్త జిల్లానే!

వైసీపీ ప్రభుత్వంలో తూ.గో, కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు దూరంగా ఉన్నాయి. దీంతో రంపచోడవరం తిరిగి తూ.గోలో కలిపితే జనాభా 10లక్షలు దాటుతుందని అంచనా. ఇదే జరిగితే మరోసారి తూ.గోజిల్లా పెదద్ది అవుతుంది. అలా కాకుండా చింతూరు, రంపచోడవరం డివిజన్లు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై నేడు సీఎం చర్చిస్తారని సమాచారం.

నిడదవోలు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్లో జరిగే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.