News October 24, 2024

తూ.గో జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

image

తూ.గో జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన తేదీ ఖరారైంది. ఈనెల 26 కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాలలోని కాంగ్రెస్ నేతలతో సమావేశమవ్వనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పార్టీ పటిష్ఠత గురించి నేతలతో చర్చించనున్నారు.

Similar News

News November 27, 2025

తూ.గో.లో మండపేట విలీనం.. పెరగనున్న పట్టణ జనాభా

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూ.గో జిల్లా పట్టణ జనాభా పెరగనుంది. మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో పూర్తిగా కలుపుతూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండపేట మున్సిపాలిటీ జిల్లా పరిధిలోకి చేరనుంది. ప్రస్తుతం రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో కలిపి 4,27,380 ఉన్న జిల్లా పట్టణ జనాభా.. మండపేట చేరికతో 4,80,968కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News November 27, 2025

స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

image

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.