News April 7, 2024

తూ.గో జిల్లాలో 98.78% పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో లబ్ధిదారులకు శనివారం నాటికి 98.78 శాతం పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ మాధవి లత తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 2,43,831 మంది పెన్షన్ దారులకు రూ.72,39,79,500 అందించాల్సి ఉందని ఆమె తెలిపారు. 98.78శాతం పూర్తి కాగా.. మిగిలిన వారికీ వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 25, 2025

రాజానగరం: హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

image

రాజానగరంలోని రథేయపాలేనికి చెందిన రాంబాబుకు హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు విధిస్తూ రాజమండ్రి 5వ అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. రాజానగరం సీఐ కథనం.. రాంబాబు 2020లో అదే గ్రామానికి చెందిన వెంకన్నను హత్య చేసి, వెంకన్న బాబును గాయపరిచాడు. ఆ ఘటనకు అప్పటి ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణల అనంతరం శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.

News January 25, 2025

రాజమండ్రి : మహిళను వేధించి హత్యాయత్నం.. జైలు

image

కాకినాడలోని వాకలపూడి వాసి వెంకన్న (25)కు రాజమండ్రి 8వ జిల్లా సెషన్స్ జడ్జి 9ఏళ్ల జైలు, రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా నిందితుడు ఓ మహిళను లైంగికంగా వేధించి , హత్యాయత్నం చేశాడని 2022లో అప్పటి ఎస్సై వి. మౌనిక కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.

News January 25, 2025

నేడు రాజమండ్రి విమనాశ్రయానికి టెక్నికల్ టీం రాక

image

రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో శుక్రవారం మిషనరీ పనులు నిర్వహిస్తుండగా క్రేన్ ద్వారా అమరుస్తున్న పిల్లర్ సెట్టింగ్ జారిపడి విషయం విధితమే. ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి కారణాలను అంచనాలు వేసేందుకు చెన్నై, హైదరాబాద్ టెక్నికల్ టీమ్స్ శనివారం వస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు.