News April 28, 2024
తూ.గో జిల్లాలో16,23,149 మంది ఓటర్లు: కలెక్టర్

తూ.గో జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా వివరాలను కలెక్టర్ కె.మాధవీలత శనివారం ప్రకటించారు. జిల్లాలో 7 నియోజకవర్గాలలో 16,23,149 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 7,92,317, స్త్రీలు 8,30,735, థర్డ్ జెండర్ 97 మంది ఉన్నారన్నారు. రాజమండ్రి రూరల్లో అత్యధికంగా పురుషులు 1,33,241 మంది, స్త్రీలు 1,39,561 మంది ఓటర్లు ఉండడం గమనార్హం.
Similar News
News April 21, 2025
అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వొద్దు: కలెక్టర్

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వకూడదని, అటువంటి ఎండార్స్మెంట్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను స్వీకరించడం, వాటికి తగిన విధంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.
News April 21, 2025
తూ.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి తూ.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,241 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-498 ➤ BC-A:88 ➤ BC-B:120 ➤ BC-C:13 ➤ BC-D:84 ➤ BC-E:48 ➤ SC-1:17 ➤ SC-2:79 ➤ SC-3:93 ➤ ST:74 ➤ EWS:120 ➤ PH-256:1 ➤ PH-05: 6. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం << 16156039>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.
News April 21, 2025
తూ.గో: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.